బాసరలో ఘనంగా నిర్వహించిన శ్రీ బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) వైస్ ప్రెసిడెంట్ మమ్మాయి రమేష్ పాల్గొన్నారు. బుధవారం జరిగిన ఈ మహోత్సవంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మమ్మాయి రమేష్ మాట్లాడుతూ, ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప స్వామి ఆశీస్సులతో రైతులు, పశుపోషకులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కురుమ, యాదవ సోదరుల ఇలవేల్పైన బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవం తరతరాలుగా కొనసాగుతున్న గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు.
స్వామివారి కృపతో నిర్మల్ జిల్లా సుభిక్షంగా ఉండి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ దేశ్ముఖ్, మాజీ జనరల్ సెక్రటరీ సంజీవరావు దేశ్ముఖ్, వార్డు మెంబర్ నానం సాయిలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కురుమ సంఘం నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.








