పారిశ్రామికంగానే కాకుండా, తలసరి ఆదాయం, పన్నుల రాబడి, జీడీపీ తదితర అంశాల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తెలంగాణ తాజాగా మరో కీలకమైన అంశంలో టాప్ లేపింది. బహిరంగ మల విసర్జన నిర్మూలన (ఓడీఎఫ్)లో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఉత్తమ ఫలితాలు సాధించి అగ్ర స్థానంలో నిలిచింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓడీఎఫ్ ర్యాంకుల్లో 99.98 శాతంతో ఈ జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది
రాష్ట్రంలో మొత్తంగా 12,769 గ్రామాలు ఉండగా… వాటిలో 12,766 గ్రామాలు ఓడిఎఫ్ గ్రామాలుగా గుర్తింపు సంపాదించాయి. ఓడీఎఫ్ లేని గ్రామాలుగా తెలంగాణలో కేవలం మూడంటే మూడు గ్రామాలు మాత్రమే మిగిలాయి. వెరసి ఓడీఎఫ్ సాధనలో తెలంగాణ రాష్ట్రం 99.98 శాతం ఫలితాలను రాబట్టినట్టైంది.
Telangana is placed in top position with a staggering score of 99.98% in the rankings for ODF plus villages👏
👉Your double engine BJP states are at the bottom of list.
👉 Still you refuse to give Telangana its due credit
👉 Looks like you're the PM of only BJP ruled states https://t.co/HWO2ScmCZi pic.twitter.com/864YTYopnl— TRS TechCell (@TRSTechCell) August 19, 2022