కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరిట నామకరణం చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అమలాపురంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు ఏపీ మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు.
కాగా, ఆందోళనకారులు దాడి చేయకముందే విశ్వరూప్ కుటుంబ సభ్యులు ఇంటినుంచి వెళ్లిపోయారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. మంత్రి ఇంటి ఫర్నిచర్ ను, ఇంటి అద్దాలను ధ్వంసం చేసిన ఆందోళనకారులు, మంత్రి ఇంటి ఎదుట ఉన్న ఎస్కార్ట్ వాహనాన్ని ధ్వంసం చేసి, ఓ బైక్ ను దగ్ధం చేశారు.
అటు, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ బాబు ఇంటికి కూడా నిప్పంటించారు. సతీష్ బాబు ఇక్కడి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు.