అమలాపురం ఉద్రిక్తతలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. రాజకీయ లబ్ది కోసమే విపక్షాలు కుట్రకు తెరదీశాయని మండిపడ్డారు. జిల్లాకు అంబేద్కర్ పేరుపెడితే మా పార్టీకి ఏమైనా లాభం ఉంటుందా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి అని ఉద్ఘాటించారు.
కోనసీమ జిల్లా పేరు మార్పుకు ప్రధాన రాజకీయ పక్షాలన్నీ మద్దతు పలికాయని స్పష్టం చేశారు. ఇదేమీ హడావుడిగా తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. అయితే, ఏ శక్తులు కుట్ర పన్నాయో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు.