contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మీ గడపకు వచ్చా… పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తా : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి

  • మీ గడపకు వచ్చా… పార్టీలకు అతీతంగా ప్రభుత్వపథకాలు అందిస్తా..
  • కారంపూడి గడపగడప కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి
  • కారంపూడి కార్యక్రమంలో ఎమ్మెల్యే పిఆర్కే కు బ్రహ్మరధం

పల్నాడు జిల్లా కారంపూడి :  మీ గడపకు వచ్చా అర్హులుంటే ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతిఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందించటమే వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని మాచర్ల ఎమ్మెల్యే పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి అన్నారు. గురువారం కారంపూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ముందుగా కారంపూడి చేరుకున్న ఎమ్మెల్యే పిఆర్కే కు గ్రామస్తులు, వైసీపీ నాయకులు భారీగా స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించి బ్రహ్మరధం పట్టారు. గ్రామంలోని కోటబురుజు సెంటర్ లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం పల్నాటి ఆరాధ్య దైవమైన అంకళమ్మతల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమన్ని బస్ స్టాండ్ సెంటర్ నుంచి ప్రారంభించటం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిఒక్క పేదవానికి సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమన్ని ఏర్పాటు చేయటం జరిగిందని ఈ కార్యక్రమం ద్వారా స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వారికీ వివరిస్తూ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అందిన పథకాలు జాబితాను కరపత్రం రూపంలో అందిస్తూ ఎంతో ఉత్సాహంగా కారంపూడి గ్రామంలో గడపగడప కార్యక్రమన్ని నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని వెంటనే పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిఒక్క సచివాలయనికి 20లక్షలు మంజూరు చేశారని ఈ నేపథ్యంలో కారంపూడి గ్రామానికి కూడా 40లక్షల నిధులు మంజూరు అయ్యాయని వీటి ద్వారా స్థానిక సమస్యలు సత్వారమే పరిష్కరించుకోవచ్చని ఎమ్మెల్యే అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించటమే తమ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. కారంపూడి పర్యటన సందర్బంగా ఎటువంటి అవంచనియ సంఘటనలు జరగకుండా కారంపూడి సిఐ దార్ల. జయకుమార్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్త్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్. అక్బర్ జానీ భాషా, మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక. కిషోర్, ఎంపిపి మేకల. శారదశ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ షేక్. షఫీ, సర్పంచ్ రామావత్. ప్రమీలభాయి తేజానాయక్, వైసీపీ నాయకులు చిలుకూరి. చంద్రశేఖర్ రెడ్డి, కొమ్ము. చంద్రశేఖర్, పాతూరి. రామిరెడ్డి, బొమ్మిన. అల్లయ్య ఎంపీడిఓ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కీర్తిసుధస్రవంతి, ఎలక్ట్రికల్ ఏఈ కోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి కాసిన్యనాయక్, అంగనవాడి సూపర్వైజెర్లు అనంతలక్ష్మి, ఉమాదేవి, తదితర శాఖల అధికారులు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ వార్డ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :