అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ ఆర్‌ఎస్ లోని మోడల్ ఫౌండేషన్ స్కూల్ నందు బుధవారం పోషణ్ పఖ్వాడా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ లక్ష్మీ అధ్యక్షత వహించగా సీడీపీఓ Y.ఎల్లమ్మ ముఖ్య అతిథిగా హాజరై పిల్లల్లో పోషకాహార లోపం నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు, 0-3 సం||, 3-6సం|| చిన్నారులు తీసుకోవాల్సిన సమతుల ఆహారం గురించి వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహార సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు అని, పౌష్టికాహారం, పరిశుభ్రత అలవాట్లు చాలా ముఖ్యమని చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో చిరుధాన్యాలు, ఆకుకూరలు, పండ్లతో చేసిన వంటకాలను ప్రదర్శించి, వాటి పోషక విలువలను వివరించారు. చిన్నారులకు ఎత్తు, బరువు పరీక్షలు నిర్వహించి, పోషణ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు కేశవ నాయుడు, జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ లక్ష్మణ్, అంగన్వాడి టీచర్ రామాంజనేయమ్మ, ఉపాధ్యాయురాలు కళ్యాణి సుప్రియ నాగరత్న మరియు అంగన్‌వాడీ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.








