contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఆవిష్కరణ

జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) యువజన విభాగం ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్‌పీ రాష్ట్ర యువజన అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు యువత బలోపేతం దిశగా పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. యువతే దేశానికి భవిష్యత్తు అని, మండలాలు, గ్రామాల స్థాయిలో యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి అధ్యక్షులు, కార్యదర్శులు సహా వివిధ పదవుల నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రక్రియలో యువత చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇబ్రహీంపట్నంలో యువత ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ జరగడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకుల హన్మాండ్లు, జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగే రజిత, జిల్లా యువజన అధ్యక్షులు గుడ్ల తిరుపతి, జగిత్యాల పట్టణ యువజన అధ్యక్షులు పన్నీరు వేణుగోపాల్, సారంగాపూర్ మండల అధ్యక్షులు గుడ్ల ప్రకాష్, ఇబ్రహీంపట్నం మండల యువజన అధ్యక్షులు గుండావేని నివాస్, సోషల్ మీడియా మండల ఇన్‌చార్జి గుండాల సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :