తన అనుచరులు కొందరిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని..
దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ విసిరారు. తనను కొద్దిరోజుల క్ర్తం వరకు పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించారని ఆయన గుర్తు చేశారు. వారి గెలుపు కోసం నన్ను ప్రాధేయపడ్డారని అన్నారు. తనకు బీఆర్ఎస్ సభ్యత్వం లేదని ఎవరో అంటున్నారట అని వ్యాఖ్యానించిన పొంగులేటి.. అలాంటప్పుడు డిసెంబర్ వరకు పార్టీ కార్యక్రమాల్లో తన ఫోటో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తనను నమ్ముకున్న అభిమానుల అభీష్టం మేరకే పార్టీ మార్పు ఉంటుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. .
ముఖ్యమంత్రి కేసీఆర్పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీని…