- ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 97 ఫిర్యాదులు.
ప్రకాశం జిల్లా : బాధితులు నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమంను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల యొక్క అర్జీలను ఎస్పీ స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల వివరాలు సవివరంగా అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు.
అందిన ఆయా ఫిర్యాదులపై ఎస్పీ సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోని,భాధితులకు న్యాయం అందించాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎక్కువగా సివిల్/భూ/ఆర్థిక తగాదాలు, అత్తరింటి వేదింపులు, చీటీ పాట మోసాలు మరియు ఇతర ఫిర్యాదులు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చీటీ పాట డబ్బులు కట్టే ప్రజలు అప్రమత్తంగా వ్యవరించాలని, పట్టణాలు మరియు గ్రామాల్లో బాగా తెలిసిన మరియు మంచి వ్యక్తులు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ/చిరు ఉద్యోగులు నడిపే అనధికార చీటీ పాటల్లో డబ్బులు కట్టరాదని, అటువంటి వ్యక్తులు వద్ద చీటీలు కడితే వారు దివాలా తీసినట్టు ఐపి పెట్టుకొని పారిపోవటం జరుగుతుందని, వడ్డీ వస్తుందని అత్యాసకి పోయి పాడుకున్న సొమ్మును చీటీ నిర్వాహకులకే ఇవ్వడం లాంటివి చేయకపోవడం మంచిది కాదని, కావున ప్రజలు ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన చీటీ నిర్వాహకుల వద్ద మాత్రమే డబ్బులు కట్టాలని సూచించారు.
అనధికారిక చీటీలు నడిపే వారిని ఉపేక్షించించేది లేదని, చీటీల వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ నిర్వహించాలంటే ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని, చీటీ పాటల పేరుతో ప్రజలను మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎస్.వి శ్రీధర్ రావు, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఐటీ కోర్ సీఐ వి.సూర్యనారాయణ, ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, ప్యానెల్ అడ్వొకేట్ బివి.శివరామకృష్ణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు రజియా సుల్తాన్, శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.