హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై ఘాటుగా స్పందించిన నందమూరి బాలకృష్ణపై ఏపీ మంత్రులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర పర్యాటకం, క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి రోజా కూడా బాలయ్యకు వార్నింగ్ ఇచ్చారు. బాలయ్య… ఫ్లూటు బాబు ముందు ఊదు… జగనన్న ముందు కాదు అంటూ హెచ్చరించారు. “అక్కడ ఉంది రీల్ సింహం కాదు… జ’గన్’ అనే రియల్ సింహం. తేడా వస్తే దబిడి దిబిడే” అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు. అంతకుముందు బాలకృష్ణపై మంత్రులు విడదల రజని, మేరుగు నాగార్జున తదితరులు కూడా ధ్వజమెత్తారు.