పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణం చోటుచేసుకుంది. గత కొద్ది కాలంగా భర్త అమీర్ తో విడిపోయి దాచేపల్లి కి చేందిన యువతీ ఫాతిమా(28) తులసి రామ్ అనే వ్యక్తి తో సత్తెనపల్లి పార్క్ ఏరియాలో సహజీవినం చేస్తుంది. ఫాతిమా ప్రియుడు తులసి రామ్ కి ఆమె పై అనుమానం రావడం తో ఇంట్లో నిద్రిస్తున్న ఫాతిమ ను కత్తితో గొంతుకోసి పరారాయ్యడు..యువతీ కేకలు వేయడం తో స్టానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫాతిమని చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఆసుపత్రికి తరలిచారు పరిస్థితి విషమం కావడం తో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసువారు.