contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా కరివేద మైపాల్ రెడ్డి నియామకం

సిద్దిపేట జిల్లా: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా నూతన రాష్ట్ర కమిటీ నియామక జాబితాను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కరివేద మైపాల్ రెడ్డిని కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు ప్రకటించారు.

నియామకంపై స్పందించిన మైపాల్ రెడ్డి, తనకు ఈ బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మి నర్సయ్యతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

కరివేద మైపాల్ రెడ్డి రెండవసారి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులవడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :