హైదరాబాద్ : జెమిని టివిలో ప్రసారమైన చదరంగం సీరియల్ ప్రొడ్యూసర్ కిషోర్ వివాదం లో చిక్కుకున్నాడు. గత తొమ్మిది నెలల క్రితం ప్రసారమైన చదరంగం సీరియల్ కి సంబంధించిన డబ్బింగ్ ఆర్టిస్టుల వేతనాలు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. తెలంగాణ మూవీ అండ్ టివి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యులు వేతనాలు అడగడానికి వెళ్లిన సభ్యులను నానా బూతులు తిట్టి తెలంగాణ యూనియన్ వాళ్ళు ఏమి చేసుకుంటారో చేసుకోండి అని దుర్భాషలాడినట్టు సమాచారం. మాకు రావాల్సిన వేతనాలకు గాను మీ సిస్టమ్స్ తీసుకెళ్తాము కార్మికుల వేతనాలు ఇచ్చి మీ సిస్టమ్స్ తీసుకెళ్లండి అని చెప్పడం తో. ప్రొడ్యూసర్ కిశోర్ అందుకుగాను మాకు పోలీసులు తెలుసు రాజకీయ నాయకులు తెలుసు డబ్బులు ఇవ్వము ఏమి పీక్కుంటారో పీక్కోండి అంటూ బాధిత యూనియన్ సభ్యులను రౌడీ షీటర్స్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అంతేకాక యస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు బనాయించి బెదిరింపులకు పాలుపడుతున్నట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
