కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: రేషన్ బియ్యం లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని చాకలివానిపల్లి గ్రామస్తులు సోమవారం తాసిల్దార్ బావ్ సింగ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ చాకలివానిపల్లె గ్రామానికి ప్రతి నెల 16 క్వింటాళ్ల రేషన్ బియ్యం పంపిణీ ఉంటుందని,. కానీ వాటికోసం ఎదురుచూపులు తప్పడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. నేటి వరకు ఈ నెలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ జరగలేదని తెలిపారు. గ్రామానికి డీలర్ లేక సమీప గ్రామానికి చెందిన డీలర్ ఇన్చార్జి గా బాధ్యతలు అప్పగించారని తెలిపారు. రేషన్ బియ్యం కోసం డీలర్ ను ప్రశ్నించగా పంపిణీ చేయడానికి నాకు సమయం లేదని పేర్కొన్నాడని వివరించారు. గ్రామానికి రేషన్ డీలర్ ను నియమించాలని విన్నవించారు.