తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం, చంద్రగిరి మండలం పరిధిలోని తొండవాడ పి.ఎమ్.ఎ.వై, ఎన్టీఆర్ నగర్ లో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు, కార్యకర్తలు.
కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యాలయ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ, “తొండవాడ పి.ఎమ్.ఎ.వై మరియు ఎన్టీఆర్ నగర్ లో ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఈ కార్యాలయమే ఉపయోగపడుతుంది. ప్రజలు నేరుగా ఈ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను అర్జీ రూపంలో అందించగలుగుతారు. ఆ అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి, తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాను” అని అన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ కార్యాలయం ప్రజలకు ఏమీ అవరోధం లేకుండా సమాధానాలను అందించగలిగే వేదికగా ఉంటుందని చెప్పారు. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు క్రమబద్దంగా పని చేస్తారని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.