contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆకాశాన్నంటనున్న టమాటా ధరలు..!

  • వర్షాలు లేక కూరగాయల ధరల పెరుగుదల
  • దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర రూ.100 మార్కు దాటే అవకాశం
  • ఉల్లి, బంగాళదుంప మినహా మిగతా కూరగాయల ధరలన్నీ పెరుగుతున్నాయన్న మార్కెట్ వర్గాలు

దేశంలో టమాటా ధరలు వేగంగా పెరుగుతున్నాయి. కిలో టమాటా ధర త్వరలో రూ.100 మార్కు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. నైరుతి రాకలో ఆలస్యం, పలుచోట్ల వర్షాలు తక్కువగా పడుతుండటంతో క్రమంగా టమాటాలు, పప్పు దినుసుల ధరలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈమారు టమాట సాగు తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది చిక్కుడుకు మంచి ధర పలకడంతో ఈమారు అనేక మంది ఈ పంటసాగువైపు మళ్లారు. దీనికి తోడు వర్షపాతం తక్కువగా ఉండటంతో అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోయాయి.

ఉల్లి, బంగాళదుంప మినహా ఇతర కూరగాయల ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కూరగాయల ధరలు సామాన్యులను ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. గతవారంతో పోలిస్తే కిలో టమాటా 10 రూపాయల మేర పెరిగి రూ.100కు చేరుకుంది…!!

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :