మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని శివంపేట్ మండలంలో బిజెపి బూత్ కమిటీ ఎన్నికల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మండలంలోని అల్లీపూర్ గ్రామంలో బూత్ కమిటీ ఎన్నికల నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు పెద్దపులి రవి, అశోక్ సాదుల, సుదర్శన్, మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన శివ్వంపేట మండలంలోని భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని తెలియజేశారు. అలాగే మండలంలోని ప్రతి గ్రామంలో భారతీయ జనతాపార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లీపూర్ శక్తి కేంద్రం ఇంచార్జ్ కుమార్ , ఓబీసీ మండల అధ్యక్షులు శివ రాములు , సభ్యత్వ ఇంచార్జ్లు సుధాకర్ , శంకర్ , బీజేపీ నాయకులు వెంకటేష్, శ్రీకాంత్, రాములు, కృష్ణ, మహేష్, శ్రీనివాస్, సాగర్, అశోక్, నర్సింలు, ప్రసాద్, గణేష్, అభిలాష్, నరేష్, శ్రీకాంత్, పోచయ్య, మల్లేష్, శంకర్, విఠల్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.