కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని సాంబయ్యపల్లి గ్రామ సర్పంచ్ గడ్డం రమ్య ఉదయ్ రెడ్డి ఎన్నికల్లో తనని గెలిపిస్తే గ్రామంలోని ప్రతి ఆడబిడ్డ పెళ్లికి పెళ్లి కానుకగా 10,116 రూపాయలను అందిస్తానన్న హామీని నిలబెట్టుకున్నారు. బుధవారం గ్రామానికి చెందిన కళ్లెం గంగారెడ్డి సత్తవ్వ ల కూతురు లక్ష్మి వివాహానికి పెళ్లి కానుకగా రూ. 10,116 లను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా సర్పంచ్ గడ్డం రమ్య ఉదయ్ రెడ్డి అందజేశారు. ఎన్నికల హామీని నిలబెట్టుకున్నందుకు గ్రామస్తులు సర్పంచ్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, జిల్లా నాయకులు కొమ్మెర రవీందర్ రెడ్డి, కళ్లెం మల్లారెడ్డి, గువ్వ విరయ్య తదితరులు పాల్గొన్నారు








