contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

విజయవాడ అమ్మవారి ఆలయంలో మరోసారి అపచారం

భక్తులు పవిత్రంగా భావించే లడ్డూల పై కూర్చున్న శానిటేషన్ ఉద్యోగి సుధాకర్….

ఇఒ గతంలో తొలగించినా…మళ్లీ ఎలా వచ్చాడంటున్న ఆలయ సిబ్బంది…

టిక్కెట్లు ఇచ్చే స్కానింగ్ సెంటర్ లో శానిటేషన్ ఉద్యోగికి ఏం పని
అమ్మ ఆశీర్వాదం కోసం లక్షల మంది భక్తులు ఇంద్రకీలాద్రి కి తరలి వస్తారు.కానుకలు, మొక్కుబడుల రూపంలో ఆ తల్లికి సమర్పించు కుంటారు.

కానీ ఆ అమ్మ దయతో వేతనాలు పొందే కొంతమంది ఉద్యోగులు మాత్రం ఆ తల్లికే అపచారం జరిగేలా, అవమానం జరిగేలా వ్యవహరిస్తున్నారు.

భక్తులు ఎంతో పవిత్రమైన ప్రసాదంగా భావించే లడ్డూల పై కూర్చుని అపవిత్రం చేశారు.

ఇందుకు దుర్గగుడి లో తాజాగా ఒక ఫొటో పై జరుగుతున్న చర్చే పెద్ద ఉదాహరణ శానిటేషన్ విభాగంలో అవుట్ సోర్సింగ్ లో పని చేస్తున్న సుధాకర్ ను గతంలో కొండ పై కేక్ కట్ చేసిన ఘటనలో ఇఒ విధుల నుంచి పూర్తిగా తొలగించింది.

తాజాగా మళ్లీ విధుల్లో చేరిన సుధాకర్ తీరు మార్చుకోక పోగా… అమ్మవారి భక్తులు ను అవమానించే విధంగా వ్యవహరించడం వివాదంగా మారింది.

అసలు శానిటేషన్ విభాగంలో ఉండాల్సిన సుధాకర్ మూడు వందల స్కానింగ్ సెంటర్ లో తిష్ట వేశాడు.

ఐదు వందలు టిక్కెట్లు ఇచ్చే కేంద్రం లో అక్కడ ఉన్న ప్రసాదాల పై కూర్చుని పెత్తనం వెలగ పెట్టాడు.

ఆ విభాగంతో సంబంధం లేకపోయినా భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల పై అలా కూర్చున్న ఫొటో కూడా అక్కడి గ్రూపుల్లో హల్ చల్ చేస్తుంది.

అక్కడ విధుల్లో ఉండాల్సిన యన్.ఎం.ఆర్ ఉద్యోగి లేకుండా…
సుధాకర్ ఆ విభాగంలో ఏం చేస్తున్నాడని చర్చ సాగుతుంది.

ఒకసారి తొలగించిన సుధాకర్ ను మళ్లీ ఎలా విధుల్లోకి తీసుకున్నారో కూడా ఎవరికీ అంతుబట్టడం లేదు.

ఇఒ స్వయంగా తొలగించినా.. మళ్లీ తీసుకురావడం వెనుక ఎవరి పాత్ర ఉందనే అంశం‌పైనా చర్చ నడుస్తుంది.

శనివారం ఉదయం సుధాకర్ అలా ప్రసాదాల పై కూర్చుని అపవిత్రం‌ చేశారని ఫొటొ పైనా చర్చ సాగుతుంది.

భక్తులు లడ్డూ ప్రసాదాన్ని కళ్లకు అద్దుకుని మరీ అమ్మవారి ప్రసాదంగా స్వీకరిస్తారు.

కానీ ఇలా లడ్డూల పై కూర్చుని, అవే లడ్డూలను ప్రసాదాలుగా ఐదు వందల టిక్కెట్టు కొన్న వారికి అందించడం భక్తులు మనోభావాలను దెబ్బతీయడమే అంటున్నారు.

ఇలా తరచూ అమ్మవారి భక్తులు మనోభావాలతో ఆడుకునే లా వ్యవహరిస్తున్న సుధాకర్, ఇతర వ్యక్తుల పైనా చర్యలు తీసుకోవాలని భక్తులే కాదు…

ఆలయ సిబ్బంది కోరుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :