contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వీడియో చూశాక .. వీరిలో జంతువు ఎవరో, మనుషులు ఎవరో? మీరే చెప్పండి ..

ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో అందరినీ ఆలోచనలో పడేసింది. ఆ వీడియోను పోస్టు చేసిన శరణ్.. వీరిలో జంతువు ఎవరు? (జాన్‌వర్ కౌన్?) అని ప్రశ్నించారు. ఆ వీడియోలో ఓ అమ్మాయి, యువకుడు ఉన్నారు. ఓ కుక్క పిల్ల కాళ్లను ఇద్దరూ చెరోవైపు పట్టుకుని దానిని గాల్లో బొమ్మలా గిరిగిరా తిప్పుతూ నవ్వుతూ కేరింతలు కొట్టారు. కుక్కపిల్లను యువకుడు రెండు కాళ్లతో వేలాడదీస్తూ, గాలిలో తిప్పుతూ వికృతానందం పొందాడు.

ఆ పక్కనే గోడపై ఉన్న కోతులకు కుక్క పిల్లను చూపిస్తూ వాటిని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ వీడియో చూశాక వీరిలో మనిషి ఎవరు? జంతువు ఎవరో? చెప్పాలని శరణ్ ఆవేదనగా ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కుక్క పిల్లను హింసించిన యువకుడు, అమ్మాయితోపాటు ఈ ఘటనను చిత్రీకరించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ఇద్దరితోపాటు దానిని షూట్ చేసిన వ్యక్తి… మొత్తం ముగ్గురూ జంతువులేనని, తన ఎదురుగా కనుక ఇలా చేసి ఉంటే వారి మూతి పగలగొట్టి ఉండే వాడినని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

https://twitter.com/AwanishSharan/status/1621768274303393794?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1621768274303393794%7Ctwgr%5Eebc68480d760ef3a15215c099d25772ae0de182d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-763797%2Fman-and-woman-swing-puppy-in-air-shocking-video-goes-viral

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :