కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రాజ్ కోటి రిపోర్టర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల “బాంబు పేలుళ్లతో.. గన్నేరువరం ప్రజల బెంబేలు” అనే కథనం రాసినందుకు అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రాజ్ కోటి నీ టార్గెట్ చేస్తూ కొందరు వ్యక్తులు రాజ్ కోటి ని బదనం చేయాలని ఇటీవల వాట్సప్ గ్రూపులో ఇద్దరు వ్యక్తులు సంభాషణ వైరల్ కావడంతో అనంతరం రిపోర్టర్ రాజ్ కోటి వారికి కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో అది కాస్త గ్రామపంచాయతీ వరకు వెళ్ళింది. ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ పెద్ద మనుషుల సమక్షంలో జరుగుతుండగా మాటా మాటా పెరిగి కొందరు వ్యక్తులు అదే గ్రామానికి చెందిన సందవేని రాములు,కాల్వ రాజు, పాశం పరశురాములు, పాశం బాలయ్య, పాశం ప్రభాకర్, సందవేని మునేందర్, గోపాలపూర్ గ్రామానికి చెందిన మోహన్, కాల్వ శ్రీకాంత్, పెంకర్ల ప్రశాంత్ లు మరికొందరు వ్యక్తులు రిపోర్టర్ తల్లి అరుణపై దాడి చేశారు. రిపోర్టర్ తో సహా వారి కుటుంబ సభ్యులపై దాడి చేసి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
