contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రైతులకు సబ్సిడీలో తైవాన్ స్ప్రేయర్లు పంపిణీ

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : పెంచికల్పేట మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో ఉన్న రైతు వేదికలో ప్రభుత్వం సబ్సిడీపై మంజూరు చేసిన 10 తైవాన్ స్ప్రేయర్లను గురువారం రైతులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్వో) తిరుపతి, వ్యవసాయ అధికారి రామకృష్ణ పాల్గొని రైతులకు స్ప్రేయర్లను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు. సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అవసరమైతే సమీపంలోని ఏఈఓ (అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్) లేదా ఏవో (అగ్రికల్చర్ ఆఫీసర్) లను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు.

అదేవిధంగా పంటల సాగుకు సంబంధించిన సమస్యలు, సందేహాలు ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓ వంశీతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :