contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

యుద్ధంపై అమెరికాలో అసంతృప్తి : ఇప్సాస్–రాయిటర్స్ సర్వే వెల్లడి

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు తాజా ఇప్సాస్–రాయిటర్స్ సర్వే వెల్లడించింది. దాదాపు ఏడు వారాలుగా కొనసాగుతున్న ఈ ఘర్షణపై ప్రజల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నప్పటికీ, యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉండటం గమనార్హం.

సర్వే ప్రకారం, ఇరాన్‌పై అమెరికా చర్యలను 54 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ యుద్ధం అనవసరమని, దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలంగా పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఖర్చులు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు కూడా ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.

రాజకీయ వర్గాలవారీగా చూస్తే, 65 శాతం మంది డెమోక్రాట్లు, 56 శాతం మంది ఇండిపెండెంట్లు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇక రిపబ్లికన్ పార్టీలో మాత్రం విభిన్న ధోరణి కనిపించింది. ఆ పార్టీకి చెందిన 54 శాతం మంది మాత్రమే యుద్ధానికి మద్దతు తెలపగా, మిగిలిన వారు వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక మొత్తం మీద ఇరాన్‌పై దాడిని కేవలం 24 శాతం మంది మాత్రమే సమర్థించగా, 22 శాతం మంది ఈ అంశంపై స్పందించడానికి నిరాకరించారు. ఇది యుద్ధంపై ప్రజల్లో స్పష్టమైన అనిశ్చితి మరియు విభేదాలు ఉన్నట్లు సూచిస్తోంది.

మొత్తానికి, ఇప్సాస్–రాయిటర్స్ సర్వే ఫలితాలు చూస్తే, ఇరాన్–అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై అమెరికా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :