అనంతపురం జిల్లా గుత్తి మండలం రాజాపురం గ్రామం వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ గురుకులం రజాపురం విద్య సంస్థ విద్యార్థిని గుడిసె శ్రీలత పదవ తరగతిలో 600కు గాను 587 మార్కులతో సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారము పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువరించిన క్రమంలో విద్యార్థిని స్వగ్రామమైన వజ్రకరూరు మండలం, కొనకొండ్ల గ్రామం, వ్యవసాయ కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు గుడిసె లక్ష్మీదేవి, గుడిసె లీలాధర్ తమ ఐదవ సంతానం సాధించిన ఉత్తీర్ణత పట్ల స్కూలు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఈ విద్య సంస్థ యొక్క ఉత్తీర్ణత శాతం కూడా 97% సాధించడం ఉపాధ్యాయుల తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షతి రేఖలు వెలువడ్డాయి. మండలంలోని పలు ఉన్నత పాఠశాల సంస్థలలో ఎస్ ఎస్ సి లో విద్యార్థిని విద్యార్థులు సాధించిన ఉత్తీర్ణతా శాతం మహర్షి దయానంద గురుకులం, ఏ వి ఆర్ హై స్కూల్, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, వివేకానంద హై స్కూల్, శ్రీ రామానుజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, పద్మ వాణి హై స్కూల్ 100% ఉత్తీర్ణత పొందారు. ఉత్తీర్ణతా ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి రవి నాయక్ అభినందిస్తూ, విద్యా సంస్థలకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా త్వరలో సప్లమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.








