తూప్రాన్ : తూప్రాన్ మున్సిపల్ శివారులోని రామాలయం సమీపంలో ఉన్న అతి పురాతన స్వయంభూ శ్రీ కూర్మా నరసింహ స్వామి దేవాలయంలో జయంతి సందర్భంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. బుధవారం, గురువారం రెండు రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామివారికి చందన విలేపనం, ఆకుపూజలు, ధ్వజారోహణం, సుదర్శన హోమం, అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఓడి బియ్యం, అన్నప్రసాదం వితరణ కార్యక్రమాలను దేవాలయ కమిటీ సభ్యులు సమర్థంగా నిర్వహించారు.
అన్నప్రసాద కార్యక్రమానికి బజారు రూపేష్ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు అహోబిలం ప్రవీణ్, నిర్వాహకులు కంటాయపాలెం వేణుగోపాల్ పాల్గొన్నారు.
అలాగే తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కొక్కొండ సమతా కాశిరెడ్డి, కౌన్సిలర్లు సబిత నాగేష్ ముదిరాజ్, బొడ్డు జ్యోత్స్న వేణు, మాజీ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ, మాజీ శివంపేట ఎంపీపీ కల్లూరు హరికృష్ణ, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మామిడి వెంకటేష్, శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.
ఇంకా సీనియర్ జర్నలిస్టులు జానకిరామ్ గౌడ్, నాగుల వేణుగోపాల్ గౌడ్, బీజేపీ నాయకులు తాటి విట్టల్, మహేష్ గౌడ్, సంఖ్య యాదగిరి, సాయి బాబా గౌడ్, శ్రీ వైష్ణవ సంఘం సభ్యులు చూర్ణం విద్యాసాగర్, తిరునగరి డాక్టర్ ప్రదీప్ సింహ, సుధాకర్, విష్ణు, శ్రీధర్, రాము తదితరులు పాల్గొన్నారు.
ఈ మహోత్సవం భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విజయవంతంగా ముగిసింది.








