మెదక్ జిల్లా – చేగుంట–తూప్రాన్ : చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాయిపేట గ్రామంలో శుక్రవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు క్వారీ నీటిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మాసాయిపేట గ్రామానికి చెందిన నాగోల్ల భాను (16), తండ్రి స్వామి, అలాగే జాల నందకిషోర్ (17), తండ్రి రాజు ఇద్దరూ విద్యార్థులు. శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో రామంతాపూర్ గ్రామ శివారులోని క్వారీ వద్ద ఉన్న నీటిలో స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ ఘటనపై నాగోల్ల భాను తండ్రి బాలయ్య (54) ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ జి. చైతన్య కుమార్ రెడ్డి కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో మాసాయిపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.








