కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్‌గా నూతనంగా నియమితులైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించిన అనంతరం తొలిసారిగా కరీంనగర్‌కు విచ్చేసిన శ్రీరామ్ చక్రవర్తిని గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు వద్ద సంఘం నాయకులు, సభ్యులు గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి గన్నేరువరం మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు బొడ్డు సునీల్ నాయకత్వం వహించారు. కార్యక్రమంలో మండల సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడు కటకం తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గొంటి సంతోష్, చీమలకుంటపల్లి గ్రామ సర్పంచ్ జంగిటి ప్రకాష్, గోపాల్పూర్ సర్పంచ్ కవిత-సంతోష్, పురంశెట్టి బాలయ్య, గొల్లపల్లి రవి, బొడ్డు భూపతి, మున్నూరు కాపు యువజన సంఘం మానకొండూరు నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లెల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డు బాలయ్య, నరసింహులు, వీరయ్య, మల్లేశం మరియు సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి అభినందనలు తెలియజేశారు.








