అనకాపల్లి / రావికమతం : రావికమతం మండలం కొమిర గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలని కోరుతూ గ్రామస్థులు సోమవారం నిర్వహించిన ఆందోళనకు సంబంధించి రిపోర్టర్ టీవీ ప్రసారం చేసిన కథనం ఫలితాన్నిచ్చింది. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు స్పందించారు.
మంగళవారం ఎస్ఎస్ఎ ఏఈ, ఎంఈవో ఎం. లింగమూర్తి కొమిర గ్రామంలోని పాఠశాలను సందర్శించి భవన పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాల పరిస్థితిని నిశితంగా పరిశీలించి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ఆయన తెలిపారు.

పాఠశాల భవనం సమస్యను త్వరితగతిన పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని తల్లిదండ్రులు అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు, స్థానిక మాజీ సర్పంచ్ జి. రవికుమార్, సొలం రాజు తదితరులు పాల్గొన్నారు.








