contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

​కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై సిర్పూర్ మండలానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాగజ్‌నగర్‌లోని ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భూపాలపట్నం ఉప సర్పంచ్ కోట శ్రీనివాస్, వార్డు సభ్యులు బుర్సా నీలక్క, మాడవి నవీన్‌లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

వీరితో పాటు కోట బాపురావు, నికడి తిరుపతి, అశోక్, కోట రాందాస్, మెట్పల్లి గంగారం తదితరులు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తమను ఆకర్షించాయని తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొంటూ, ఆ దిశగా తాము కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :