మాసాయిపేట–తూప్రాన్ : మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. మెదక్ ఎంపీ రఘునందన్ రావు చొరవతో రైల్వే అధికారులు స్పందించి మరమ్మతు పనులను వేగవంతం చేశారు. గతంలో స్వల్ప వర్షానికే బ్రిడ్జి కింద భారీగా నీరు నిలిచి, మాసాయిపేటతో పాటు సుమారు 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. స్థానిక బీజేపీ నాయకులు సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పనులు పూర్తయితే వేలాది మంది ప్రజలకు, వాహనదారులకు ఉపశమనం కలుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








