contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఈ నెల 26న కాగజ్‌నగర్‌కు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం రాక

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్: ఈ నెల 26న ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కాగజ్‌నగర్ పట్టణానికి రానున్నట్లు తెలంగాణ జేఏసీ, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక నాయకులు వెల్లడించారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కాగజ్‌నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్స్‌లో తెలంగాణ జేఏసీ, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ జేఏసీ సిర్పూర్ కన్వీనర్ వి. కిషోర్ కుమార్ (అడ్వకేట్), తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక కాగజ్‌నగర్ కన్వీనర్ ఈర్ల విశ్వేశ్వరరావు పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కాగజ్‌నగర్‌లోని పటేల్ గార్డెన్స్‌కు విచ్చేసి తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులతో సమావేశమవుతారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించేందుకు, ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కానుందని పేర్కొన్నారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, యువత, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సంఘీభావాన్ని తెలియజేయాలని వారు కోరారు.

ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ జేఏసీ, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక నాయకులు, ప్రతినిధులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :