contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కారంపూడి ఎస్సై వేధింపులు – మహిళ ఆత్మహత్యాయత్నం

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లా కారంపూడిలో పోలీసుల వేధింపుల కారణంగా ఓ మహిళ పురుగుమందు తాగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదంలో గాదేవారిపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కారంపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

బాధిత కుటుంబం ఆరోపణల మేరకు, సదరు వ్యక్తిని నాలుగు రోజుల పాటు పోలీస్ స్టేషన్‌లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన అతని భార్య లక్ష్మి పురుగుమందు సేవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై బాధిత దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, కారంపూడి ఎస్ఐ వ్యవహారశైలి కారణంగా తమకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. తమకు న్యాయం చేయడంతో పాటు ఘటనపై ఉన్నతాధికారులు నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

అయితే, ఈ ఆరోపణలపై కారంపూడి పోలీసుల అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :