గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి తండ్రి కొమ్మెర ధర్మారెడ్డి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ నియోజవర్గ ఎమ్మెల్యే డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ తోకలిసి మంగళవారం మాదాపూర్ లోని వారి నివాసానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన ధర్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. ధర్మారెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ,వారి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాదరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్కు ఉపేందర్ రెడ్డి,గన్నేరువరం సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కటకం తిరుపతి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్, మహిళా అధ్యక్షురాలు జెల్లా రాజేశ్వరి,మండల నాయకులు మార్గం మల్లేశం, గన్నేరువరం చాకలివానిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి,కూన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.








