హైదరాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, పార్టీని అంతర్గత విభేదాల నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ధర్నా నిర్వహించారు. “నాన్ లోకల్ కో హటావో – కాంగ్రెస్ బచావో” అనే నినాదాలతో నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.
జిల్లాలో పార్టీ కార్యకలాపాలకు స్థానిక నాయకత్వానికే ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా శ్రమించిన స్థానిక కార్యకర్తలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక నాయకులను పక్కనబెట్టి ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పార్టీ బలహీనపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్ఠానం వెంటనే జోక్యం చేసుకుని జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, స్థానిక నాయకుల అభిప్రాయాలను గౌరవిస్తూ పార్టీని ఐక్యంగా నడిపే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ధర్నా సందర్భంగా “కాంగ్రెస్ బచావో”, “నాన్ లోకల్ కో హటావో”, “స్థానిక నాయకులకు న్యాయం చేయాలి” అంటూ నినాదాలు మార్మోగాయి. పార్టీ బలోపేతమే తమ లక్ష్యమని, అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.








