గోదావరిఖని : మంథని మండలం ఏక్లాస్‌పూర్ గ్రామంలో పల్లె దవాఖాన వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు హెచ్‌ఐవీ వ్యాధి వ్యాప్తి, నివారణ చర్యలు, చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ డి. జ్యోతి మాట్లాడుతూ హెచ్‌ఐవీని ప్రారంభ దశలోనే గుర్తించి, వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. హెచ్‌ఐవీ ఉందో లేదో తెలుసుకోవడానికి అవసరమైన వారు రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
హెచ్‌ఐవీ, ఎయిడ్స్ ఎలా సంక్రమిస్తాయి, వాటి లక్షణాలు ఏమిటి, వ్యాధి వ్యాప్తిని ఎలా అరికట్టాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే అంశాలను వైద్య సిబ్బంది ప్రజలకు వివరించారు. అపోహలకు లోనుకాకుండా వ్యాధిపై సరైన అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌ఈఓ ఎం. శ్రీనివాస్, హెల్త్ సూపర్‌వైజర్ ఉమాదేవి, ఐసీటీసీ కౌన్సిలర్ సత్యానందం, కమ్యూనిటీ కోఆర్డినేటర్ రాజేశ్వరి, ల్యాబ్ టెక్నీషియన్ సుకుమార్, ఏఎన్‌ఎం స్వప్న, ఆశా వర్కర్లు రజిత, రాజేశ్వరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.








