contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మండలంలో ‘సారథి’ గుసగుసలు .. విధులకు స్వస్తి … తిరుగుళ్లపైనే ధ్యాస?

  • చార్జ్ తీసుకున్న కొత్తలో ఘనకార్యాల హడావుడి!
  • ఇప్పుడు పక్కన పడ్డ అధికారిక పనులు … మహిళా సిబ్బందితోనే ప్రయాణాలు!
  • అధికారి తీరుపై మండలంలో ప్రజల గుసగుసలు, విమర్శలు

 

పాకాల (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా పాకాల మండలంలో మండల స్థాయిలో బాధ్యతలు స్వీకరించిన కొత్తలో తనదైన శైలిలో దూసుకుపోతూ, విధుల పట్ల ఎంతో నిబద్ధత ప్రదర్శిస్తున్నట్లు హడావుడి చేసిన ఒక మండల స్థాయి అధికారి వైఖరి ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొదట్లో “ఆహా… భలే పనిచేస్తున్నారే” అని ప్రజలతో ప్రశంసలు పొందిన సదరు అధికారి, ఇప్పుడు ప్రజోపయోగ పనులను, అధికారిక బాధ్యతలను పూర్తిగా పక్కన పెట్టేశారని మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

డ్రైవింగ్ నేర్పించడం నుండి… నిత్యం వెంటే తిప్పుకోవడం వరకు! ప్రజా సమస్యలు పరిష్కరించడం, మండల అభివృద్ధిని పర్యవేక్షించడం పక్కన పెట్టి, పంచాయతీ స్థాయిలో పనిచేసే మహిళా అధికారులతో సమయం గడపడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. పంచాయతీ స్థాయి మహిళా ఉద్యోగులకు వాహన డ్రైవింగ్ నేర్పించే నెపంతో ప్రారంభమైన ఈ సాన్నిహిత్యం, ఇప్పుడు నిత్యం వారిని కారులో వెంటేసుకొని తిరిగే స్థాయికి చేరిందని పలువురు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.

పరిపాలన పడకేసింది… సదరు అధికారి తీరు వల్ల మండలంలో ప్రాధాన్యత సంతరించుకోవాల్సిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మందగించాయని ప్రజలు వాపోతున్నారు. ఆఫీసు పనుల కంటే, వ్యక్తిగత తిరుగుళ్లకే ప్రాధాన్యత ఇస్తూ కాలాన్ని వృథా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “ప్రారంభంలో బహు పరాక్… ప్రస్తుతం పనికి స్వస్తి” అన్నట్లుగా తయారైన ఈ అధికారి వ్యవహార శైలిపై మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండల పరిపాలనను పట్టాలెక్కించాలని, సదరు అధికారి తీరుపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :