contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాకాలలో రెండు ఆటోలు ఢీ .. అందుబాటులో లేని 108 వాహనం

  • 108 అందుబాటులో లేక ప్రైవేట్ వాహనంలో తరలింపు.. పోలీసుల ఆలస్యంపై స్థానికుల ఆగ్రహం

 

పాకాల, తిరుపతి జిల్లా: పాకాల మండలం ఇరంగారిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడగా, నలుగురు చిన్నారులకు గాయాలైనట్లు సమాచారం. ప్రమాదానికి గురైన వారిలో గాదంకి గ్రామానికి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.

ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు వేగంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన నలుగురు చిన్నారులను వెంటనే చికిత్స నిమిత్తం కొత్తకోట, తిరుపతిలోని ఆసుపత్రులకు తరలించారు.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో పాకాల 108 అత్యవసర వాహనం అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులను ప్రైవేట్ వాహనాల్లో ఆసుపత్రులకు తరలించాల్సి వచ్చిందని బాధితుల బంధువులు తెలిపారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ సేవలు అందుబాటులో లేకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన ప్రాంతానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోనే పాకాల పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ, ప్రమాదం జరిగిన అరగంట తర్వాత కూడా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోలేదని స్థానికులు ఆరోపించారు. దీంతో బాధితుల బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ సేవలు, పోలీసుల స్పందన వేగంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రమాద ప్రాంతాల్లో తక్షణ స్పందన వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

ప్రమాదానికి గల పూర్తి కారణాలు, గాయపడిన వారి పరిస్థితిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :