పల్నాడు జిల్లా – మాచర్ల : మాచర్ల పట్టణంలోని వైసిపి కార్యాలయంలో 6వ వార్డుకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా వైసిపి అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజల్లో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై వారితో చర్చించారు.
కార్యక్రమంలో 6వ వార్డుకు చెందిన నాయకులు బుదాల మరియమ్మ, బోల్లెద్దుల సందీప్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.








