మెదక్ జిల్లా – తూప్రాన్ : డయల్-100కు వచ్చిన ఫిర్యాదుపై స్పందించేందుకు వెళ్లిన పోలీసులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఎనిమిది మందిపై తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో నిన్న డయల్-100కు కాల్ రావడంతో పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫిర్యాదుపై స్పందిస్తున్న సమయంలో జంగం నవీన్, తొంట సతీష్, తొంట అనిల్, గోలిపల్లి వెంకట్రెడ్డి, గోలిపల్లి రాజారెడ్డి, తొంట గణేష్, జంగం కిరణ్, బుర్ర వంశీగౌడ్‌లు మద్యం సేవించిన స్థితిలో పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తూ, దుర్భాషలాడుతూ విధులకు ఆటంకం కలిగించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు.
విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించడం, విధులకు ఆటంకం కలిగించడం చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని పోలీసులు హెచ్చరించారు








