- స్పందన లో పిర్యాదు చేసిన బాధిత గ్రామాల ప్రజలు
అల్లూరి జిల్లా పాడేరు : కొట్న పల్లి గ్రామంలో అక్రమ నల్ల రాయి క్వారీ నిలుపుదల కొరకు శుక్రవారం నాడు స్పందనలో కొట్న పల్లి పంచాయతీ లోగల బాధిత గ్రామాలు ప్రజలు ఫిర్యాదు చేశారు. కొట్నపల్లి పంచాయతీ లో కొట్నపల్లి గ్రామంలో ఎన్ ఎచ్ 516 ఈ రోడ్డు నిర్మాణం కొరకు తేదీ 19-18-2020 నుండి నేటి వరకు నిర్వహిస్తూనే ఉన్నారు. సదరు ప్రారంభం తేదీనాడు రాసుకున్న గ్రామపంచాయతీ తీర్మానం అడిగితే మా దగ్గర లేదని పంచాయతీ అధికారి అంటున్నారు, 4 ఏళ్ల గడిచిపోయిన కానీ నేటి వరకు ఆపకుండా రోజు రెండు పూటలు బాంబు పేలులతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకి గురిచేస్తు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉందని దూళి కారణంగా గుండె జబ్బులు పంట పొలాలు నష్టం వస్తుంది బాంబు పేలుళ్ల శబ్ధాలకు ముసలి వాళ్లు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులకి గురి అవుతున్నారు.ఇళ్ళ గృహాలు పగుళ్లు ,బీటలు వస్తున్నాయి, పేలుళ్ల సమయంలో కెమికల్ దుర్వాసనా కారణంగా ఊపిరి పీల్చటానికి కూడా ఇబ్బంది పడుతున్నాము
మంచినీటి సమస్య కూడా తలెత్తుతుంది , 120 సర్వే నెంబర్ గల అమాయక గిరిజన 13 మంది రైతులు మభ్యపెట్టి టీఎస్సార్ కంపెనీ యాజమాన్యం గడువు పూర్తి అయినాక వేరోక కంపెనీ బినామీ దారుడికి అప్పచెప్పినట్టు మాకు సమాచారం వచ్చిందని క్వారీ నిలుపుదల కొరకు ఎన్నిసార్లు అభ్యర్థించిన అడిగిన ఆఖరికి నిలదీసి అడిగిన ఎటువంటి స్పందన లేదు అయినా గట్టిగా అడిగితే లేదా ప్రశ్నిస్తే గ్రామాల ప్రజా ప్రతినిధులు,విలేకరులు, గ్రామ పెద్దలను పోలీసు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. క్వారికి గడువు పూర్తి అయిన కారణంగా దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మా యొక్క ఇబ్బందులకు మరి భవిష్యత్తులో రాబోయే 10 పరిణామాల దృష్ట్యా పునరాలోచన చేసి క్వారీ నీ నిలిపి వేయాలనీ కొట్నపల్లి పంచాయతీ ప్రజలు పిర్యాదు చేశారని మీడియా ద్వారా తెలియజేశారు