అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నెలగొండ గ్రామంలోని ఉపాధిహామీ పనుల వద్దకు సిపిఎం పార్టీ నాయకులు వెళ్ళి కూలీల సమస్యలు అడగ్గా గత 10 వారాలుగా కూలీ డబ్బులు ఇవ్వలేదు, వేసవికాలంలో మెడికల్ కిట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, త్రాగునీరు సరిగా అందజేయట్లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణమూర్తి స్థానిక గ్రామ సచివాలయ కార్యాలయం ఎదుట వెంటనే కూలీ డబ్బులు చెల్లించి సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించి పంచాయతీ కార్యదర్శి భీమాంజనేయ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు
