యాడికి : భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వ్యవసాయాన్ని అందించేందుకు ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని యాడికి మండలం FMT జి. గోపి సూచించారు. అధిక ఉష్ణోగ్రతలను తగ్గించడంతో పాటు పంటల దిగుబడిని పెంచుకునేందుకు ప్రకృతి వ్యవసాయంలో భాగమైన PMDS (Pre-Monsoon Dry Sowing) విధానాన్ని రైతులు విస్తృతంగా అవలంబించాలని కోరారు.
అనంతపురం జిల్లా CT/IO DPM శ్రీ లక్ష్మానాయక్ ఆదేశాల మేరకు, డాక్టర్ నవీన్ సూచనలతో గుత్తి డివిజన్ పరిధిలోని యాడికి మండలం చందన గ్రామపంచాయతీ పచ్చారుమేకలపల్లి గ్రామంలో PMDS కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామానికి చెందిన రైతు శ్రీహరి నిమ్మ తోటలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఐదు రకాల ప్రధాన పంటలతో పాటు సుమారు 20 రకాల జీవ వైవిధ్య విత్తనాలను కలిపి నవధాన్యాల మిశ్రమంతో విత్తన గుళికలను తయారు చేశారు. అనంతరం వాటిని ఐదు ఎకరాల పొలంలో PMDS పద్ధతిలో విత్తనాలు వేశారు.
ఈ సందర్భంగా FMT జి. గోపి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు పంట పొలాల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. భవిష్యత్ తరాలకు ప్రకృతి వ్యవసాయాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రతి రైతు PMDS విధానాన్ని అనుసరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం RYSS (APCNF) సిబ్బంది ICRP హరి ప్రసాద్, ఎస్తేరు రాణి, TICRPలు శ్యామల, జి. లక్ష్మీదేవి, ఎల్. లక్ష్మీదేవి, అనసూయ, అనూష, సుగుణతో పాటు పలువురు రైతులు








