contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దైవసేవకుడు సురేంద్ర కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం

గురజాల, :అవసరంలో ఉన్న దైవసేవకుల కుటుంబాలకు అండగా నిలుస్తూ పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ మానవీయతను చాటుకుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్‌కు అనుబంధంగా ఉన్న పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్‌లో సభ్యుడిగా కొనసాగుతూ, గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జానపాడులో సేవలందించిన దైవసేవకుడు సురేంద్ర ఇటీవల మృతి చెందారు.

ఈ నేపథ్యంలో ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిష్టర్ నిర్ణయం మేరకు, సురేంద్ర కుటుంబ సభ్యులకు పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న సేవకులకు, వారి కుటుంబాలకు అండగా నిలవడమే ఫెలోషిప్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోర్ కమిటీ సభ్యులు రెవ.టి. సుధీర్ బాబు, పిడుగురాళ్ల నియోజకవర్గ రీజనల్ ఇన్‌చార్జి రెవ. బి. దేవదాసు, స్థానిక ఫెలోషిప్ కమిటీ గౌరవ అధ్యక్షులు యెహోషువ, పాస్టర్లు అమర్నాద్, బోయాజు, మరియదాసు, యెహోషువ, హుస్సేన్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సాయం అందుకున్న దైవసేవకుడు సురేంద్ర కుటుంబ సభ్యులు, స్థానిక ఫెలోషిప్ సభ్యులు జిల్లా ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిష్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  సేవకులకు భవిష్యత్తులోనూ ఫెలోషిప్ అండగా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :