contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మాచర్లలో ఘనంగా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు

పల్నాడు జిల్లా  –  మాచర్ల : జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రిల పోరాటం, త్యాగాలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పల్నాడు జిల్లా వైసిపి అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా మాచర్ల పట్టణంలోని వైసిపి కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ అనుసరించిన అహింసా మార్గాన్ని, దేశ సేవలో లాల్‌ బహదూర్‌ శాస్త్రి అందించిన సేవలను ఆయన స్మరించుకున్నారు.

‘జై జవాన్‌.. జై కిసాన్‌’ నినాదంతో సైనికులు, రైతుల ప్రాధాన్యతను దేశానికి చాటిచెప్పిన శాస్త్రి సేవలను ఆయన కొనియాడారు. ఈ మహనీయుల ఆశయాలు, త్యాగాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రికి నివాళులర్పించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :