కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కార్నర్ ముగింపు సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి పాల్గొని కార్నర్ ముగింపు సభలో మాట్లాడారు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం గురించి చేపడుతలేరని నిమ్మకు నీరెట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారికంగా రోడ్డుకు పర్మిషన్ వచ్చిన రోడ్డు వేయని దుస్థితి కనబడుతుంది. ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా రోడ్డు విషయంలో పట్టించుకోని నాయకుడే ఈ నియోజకవర్గంలో కరువైనాడు. ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారు, డబుల్ బెడ్ రూములు ఎంతమందికి ఇచ్చారు, దళితులకు మూడెకరాల భూమి ఎంత మందికి ఇచ్చారు, దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఈ నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చారో ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సొల్లు అజయ్ వర్మ ప్రశ్నిస్తున్నారు, అలాగే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి పథకాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం లేదు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి కరోనా వ్యాక్సిన్ మూడేళ్లుగా ఉచిత రేషన్ బియ్యం ప్రజలకు ఆపదలో ఉండే ఆయుష్మాన్ భారత్ పిఎం జన్ ధన్ ఖాతా బేటి బచావో బేటి పడావో మిషన్ స్వచ్ఛ భారత్ పీఎం ముద్ర యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కిల్ ఇండియా యోజన స్మార్ట్ సిటీ చొరవ యోజన ఎన్నో పథకాలను భారత దేశ ప్రజలకు ప్రవేశపెట్టినటువంటి బిజెపి ప్రభుత్వం రానున్న రోజుల్లో మానకొండూరు నియోజకవర్గం లో కాషాయ జెండా ఎగరవేయాలని అన్నారు, ఈ కార్యక్రమంలో
బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ,మానకొండూరు అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి,సెన్సార్ బోర్డు మెంబరు దరువు ఎల్లన్న, శక్తి కేంద్రం ఇంచార్జ్ తిప్పర్తి నికేష్, బిజెపి మండల ఉపాధ్యక్షులు సుమిత్ రెడ్డి,మునిగంటి సత్తయ్య, దళిత మోర్ఛ ప్రధాన కార్యదర్శి కొంకటి సాయి, గణేష్, బోయిన హరీష్, కొంకటి అనిల్, కొరివి విజయ్, అజయ్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.