- బొల్లారం పారిశ్రామిక వాడలో కల్వర్టు లేకుండా రోడ్డు నిర్మించడం తో చెరువులను తలపిస్తున్న రోడ్లు
- వెంటనే మరమ్మతులు చేపట్టాలి
- ప్రముఖ సంఘ సేవకుడు కేజేఆర్ ఆనంద్ క్రృష్ణారెడ్డి
బొల్లారం పారిశ్రామిక వాడలో కల్వర్టు లేకుండా రోడ్డు నిర్మించడం తో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని ప్రముఖ సంఘ సేవకుడు కెజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని వర్షపు నీరు నేరుగా ఇళ్లలో వెళ్లడం తో నా కార్మిక సోదరులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, మున్సిపల్ సిబ్బంది వారానికి రెండుసార్లు రోడ్లను క్లీన్ చేయించాలని, లక్షలాది రూపాయలు పరిశ్రమ యాజమాన్యం పన్నులు రూపేణా కట్టతున్నా పారిశ్రామిక వాడలో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం చాలా అధ్వాన్నంగా తయారైందని వెంటనే జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు