contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

బీఎస్పీ ప్రశ్నించడంతో RDS కాలువకు నీళ్లు

జోగులాంబ( ఉండవల్లి): బీఎస్పీ నాయకులు ప్రశ్నించడంతో RDS కాలువకు నీళ్లు వదిలిన అధికారులు. గతనెల 29వ తారీకు పాదయాత్రలో భాగంగా బీఎస్పీ నాయకులు ఉండవల్లి మండల పరిధిలోని 34 వ కాలవను పరిశీలించారు. నీరు ఏమాత్రం లేకుండా ఎండిపోయిన కాలువనుచూసి బీఎస్పీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏమాత్రం ఉపయోగపడకుండా ఎందుకు ఇంత నిరుపయోగంగా ఉంచారు. అతి తొందరలోనే నీరు పారించేంతవరకు బిఎస్పి ఊరుకోదు లేకుంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడి చేస్తామని బిఎస్పి నాయకులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇది తెలుసుకున్న అధికారులు మరియు నాయకులు వెంటనే RDS 34 కాలువకు నీళ్లు వదలడం జరిగింది. గురువారం బిఎస్పి నాయకులు ఉండవల్లి మండల కేంద్రాన్ని సందర్శించిన క్రమంలో మరల RDS 34 కాలువను పరిశీలించి అక్కడ మాట్లాడడం జరిగింది. బిఎస్పీ నాయకులు మాట్లాడుతూ ఇలా బిఎస్పి ప్రశ్నించడంతో ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ప్రజలకు అండగా ఎల్లప్పుడు బీఎస్పీ పార్టీ ఉంటుందని రాబోయే రోజుల్లో బీఎస్పీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ప్రజలు ముందుకు అడుగు వేయాలని అధికారం ఉంటే అనేకమైన పనులు ప్రజలకు బిఎస్పి చేసి పెడుతుందని వారు హర్ష భావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎం సి కేశవరావు ,నియోజకవర్గం అధ్యక్షులు బి మహేష్ ఉందవెళ్ళి గ్రామస్తులు బాలకృష్ణ ,ఉండవెల్లి కో కన్వీనర్ అయ్యన్న, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :