contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్ సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ సమావేశం

కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో కూకట్ పల్లి కేంద్ర కార్యాలయంలో ఈరోజు అంతర్గత మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిసిఆర్ సంస్థ ఫౌండర్ మంచి కట్ల అనిల్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది.. అలాగే సెంట్రల్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, లీగల్ అడ్వైజర్స్ మరియు ఇతర వాలంటీర్ సభ్యులు పాల్గొనడం జరిగింది..

ఈ కార్యక్రమంలో సిసిఆర్ ఫౌండర్ మంచికట్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ సిసిఆర్ సంస్థలో ఉన్న సభ్యులకు గౌరవ వేతనాన్ని ఇచ్చే విధంగా మరియు డ్రాప్టింగ్ కమిటీ సభ్యులకు సూచనలు, సలహాలు ఇస్తూ సంస్థ కార్యక్రమాలలో ముందుకు పోవడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్క సిసిఆర్ సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది..

అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులలో సిసిఆర్ సంస్థ సభ్యులచే రికార్డుల తనిఖీల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, అవినీతిని వెలికి తీసే ఆధారాలను సేకరించి, వాటి రిపోర్టులను ఉన్నతాధికారులకు అందజేసే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది..

అలాగే ఈ రిపోర్టులన్నీ కలిపి ఒక మెగా రిపోర్ట్ లుగా తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి పంపించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి 10 నుండి 12 మంది సభ్యులు గల సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం సిసిఆర్ సంస్థ చరిత్రలో నిలిచిపోయే విధంగా రికార్డు స్థాయిలో రికార్డులు తనిఖీలు చేసి అవినీతిని వెలికి తీసి అవినీతి చేసిన సొమ్మును వారి నుంచే రికవరీ చేసే విధంగా సిసిఆర్ సంస్థ ముందుండి చర్యలు తీసుకుంటుందని తెలియజేయడం జరిగింది…

అలాగే సిసిఆర్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సర్వీసెస్ (CTE),లీగల్ సర్వీసెస్(CLS )మరియు మీడియా సర్వీసెస్ ని కూడా ప్రారంభించి అన్ని జిల్లాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు అశోక్ కాకర్ల గారు మాట్లాడుతూ సిసిఆర్ సంస్థ ఆధ్వర్యంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు జిల్లాల లను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకుని అన్ని జిల్లా కేంద్రాలలో సిసిఆర్(CCR )మరియు సిటిఈ (CTE)మరియు సి ఎల్ ఎస్(CLS) సర్వీసులను ప్రారంభించే విధంగా సంస్థ సభ్యులకు సూచనలు సలహాలు తెలియజేయడం జరిగింది…

అలాగే సంస్థ లో ఉన్నటువంటి సభ్యులు కానీ వాలంటీర్ సభ్యులు కానీ ఎవరైనా కూడా సంస్థ పేరుని వాడుకొని లేదా సంస్థ కేటాయించినటువంటి గుర్తింపు కార్డుని వాడుకొని తమ స్వలాభాలకు వాడుకోవడం లేదా అధికార దుర్వినియోగం చేసినట్లు తమ దృష్టికి వస్తే అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు చేపట్టాలని తెలియజేయడం జరిగింది..

అంతేకాకుండా అవినీతి అంతం కొరకు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో చాలా ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఆర్టిఐ ఆర్ట్ -2005 కు సంబంధించినటువంటి చట్టాలను పూర్తిగా ప్రజలకు తెలియజేసే విధంగా సంస్థ సభ్యులు కృషి చేయాలని తెలియజేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు అశోక్ కాకర్ల, రాజేష్ బింగి ,చరణ్ కాంత్ భూక్యా, చంద్రకాంత్ భుఖ్య, ప్రసాద్ ఎలిశెట్టి, లీగల్ అడ్వైజర్ మణికంఠ తో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి సభ్యులు చారుకొండ బాబు, మిద్దె శివప్రసాద్, కొట్టు మల్లేశ్వరరావు, బొల్లె రాజు, వెంకటరెడ్డి, వంగూరి మధు ఇతర సభ్యులు పాల్గొన్నారు…

అవినీతి అంతం సిసిఆర్ పంతం అనే నినాదంతో ప్రతి ఒక్క భారత పౌరునికి కూడా ఆహ్వానం పలుకుతుంది సిసిఆర్ సంస్థ.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :