contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ఏం సాధించారని దశాబ్ది వేడుకలు..!

  • రైతుల రుణమాఫీ చేయని ప్రభుత్వం
  • ఉద్యమకారులను విస్మరించిన ప్రభుత్వం
  • టిపిసిసి బిసి సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ & బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్

సిద్దిపెట్ జిల్లా : కోహెడ మండల కేంద్రంలో శనివారం టిపిసిసి బిసి సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ & బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తెలంగాణ సబ్బండ వర్గాల సమస్యలను పరిష్కరించకుండా కేసీఆర్ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాడని అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు ,అమర వీరుల కలలను రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయి అరాచక పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.ఆంధ్ర పెట్టుబడి దారులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని మండిపడ్డారు.
రైతులకు రుణమాఫీ చెయలేదు అకాల వర్షాలకు పంట నష్టపోయినా రైతులకు నష్టపరిహరం ఇవ్వలేదు చాల మంది రైతులు ఆత్మహత్యలు చెసుకుంటున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చెసుకుంటున్నారు. తెలంగాణలో ఎవర్గం వారు కూడా సంతోషంగా లేరు ఎందు కోసం ఎవరి కోసం ఈ దశాబ్ది వెడుకలు జరుపుతున్నారో అర్దం కాని పరిస్ధితి ఉందన్నారు రాబోయె కాలంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :