contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ ఉపాధ్యక్షుడిగా మొగరాల హరిప్రసాద్ రెడ్డి నియామకం

పాకాల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ ఉపాధ్యక్షుడిగా మొగరాల హరిప్రసాద్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమించింది. పార్టీ బలోపేతంతో పాటు పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో ఆయనకు ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

హరిప్రసాద్ రెడ్డి నియామకాన్ని పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. పార్టీ కోసం ఆయన నిరంతరం చేసిన సేవలను గుర్తించి అధిష్ఠానం ఈ బాధ్యతలను అప్పగించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు హరిప్రసాద్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్ర పబ్లిసిటీ విభాగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ ఆశయాలు, విధానాలు, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ ఉపాధ్యక్షుడి బాధ్యతలను అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి మొగరాల హరిప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకత్వం సూచనల మేరకు అందరినీ కలుపుకొని పబ్లిసిటీ విభాగాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :